ప్రపంచ తెలుగు మహాసభలు సోమవారం అనగా నాలుగోరోజు చేరుకున్నాయి. ఈ రోజు సాయంత్రం 6గంటలకు తెలంగాణ మంత్రి తలసాని ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి జరగనుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.
‘మా’ అధ్యక్షులు శివాజీరాజా, సినీ నటులు నాగార్జున, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళితో పాటు పలువురు ప్రముఖులు హాజరై కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 6.30 -7.00 గంటల వరకు మలేసియా తెలుగు సాంస్కృతిక కార్యక్రమం జరగనుంది.