మెగాస్టార్ 151వ చిత్రం సైరా షూటింగ్ డిసెంబర్ 6న త్వరలో ప్రారంభం కానున్నదని తెలిసిందే, మెగాభిమానులు ఎదుచూపులు త్వరలోనే తీరనున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూట్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసారు.  సుమారు వంద మంది విదేశీ జూనియర్ ఆర్టిస్టులను తీసుకోనున్నారు . వీలయినంత వరకు హైదరాబాద్, ముంబాయి ల నుంచి రప్పించాలని, చాలకపోతే బయట నుంచి రప్పించాలని భావిస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే ఈ నెల ఆరు నుంచి పది రోజుల పాటు సైరా సినిమా షూట్ ను రిహార్సల్స్ చేసి పది రోజుల తరువాత ఆపేసి, ఆ ఫుటేజ్ ను పూర్తిగా పరిశీలిస్తారట.

మెగాస్టార్ చిరంజీవి గెటప్ అన్ని విధాలా సరిపోయిందా లేదా? అన్న దానిపై డిఫరెంట్ ఒపీనియన్లు తీసుకుని, అన్ని విధాలా సంతృప్తి వస్తే, షూట్ మళ్లీ స్టార్ట్ చేస్తారట. లేదూ అంటే, ఈ ఫుటేజ్ అంతా పక్కన పడేసి, గెటప్ లో కావాల్సిన ఛేంజెస్ చేసి, మళ్లీ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. అంటే ఒక విధంగా ఇది రియల్ రిహార్సల్ షూట్ అన్నమాట. నూటయాభై కోట్ల సినిమా కాబట్టి ఆ మాత్రం జాగ్రత్తలు వుండడం అవసరమే. పైగా చిరంజీవి ఏదీ ఒకపక్కన ఫిక్స్ కారు. ఖైదీ 150సినిమా విషయంలో కూడా ఇలాగే చాలా కిందా మీదా పడి, జాగ్రత్తలు తీసుకున్న తరువాతే పూర్తి చేసారు. మరి మెగా స్టార్ కి అల్ ది బెస్ట్ చెబుదాం!