కమెడియన్ కమ్ హీరో సునీల్ ఇప్పుడు క్రొత్త వివాదంలో చిక్కుకున్నాడు అసలే ఈ మధ్య విడుదలైయిన ఉంగరాల రాంబాబు సినిమాతో  ప్రేక్షకులకు చేరువకాలేకపోయాడు  ఇప్పుడు మెగా సైరా సినిమా గురించి ఇచ్చిన స్టేట్ మెంట్ సోషల్ మీడియా లో వైరల్ అయింది.
అసలు విషయం ఏమిటంటే ఉంగరాల రాంబాబు సినిమా ఇంటర్వ్యూ లో ‘సై రా సినిమాలో కమెడియన్ గా అవకాశం వస్తే చేస్తారా’ అని అడిగిన ప్రశ్నకు ఒకసారి అవకాశం మిస్ అయింది. అన్నయ్య సినిమాలో చేయడం. ఈసారి అవకాశం రావాలే కానీ, వదులుకునే ప్రసక్తే లేదు’ ఇదీ కమెడియన్ ప్లస్ హీరో సునీల్ సమాధానం.
కానీ దానికి ఏం జరిగింది. సైరా సినిమాలో సునీల్ వున్నాడు అని కొందరు, సైరా సినిమాకు సునీల్ అగ్రిమెంట్ చేసాడని మరి కొందరు కథలు అల్లేసారు. అలా అలా వార్తలు పుట్టుకువచ్చేసాయి.సైరా లో సునీల్ ఏమిటీ అని, ఇప్పుడు సైరా యూనిట్ కు కోపం వచ్చేసినట్లు తెలుస్తోంది.

చిరు సన్నిహితులు ఈ మేరకు ఏం జరిగింది, అసలు సునీల్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్నది ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీంతో సునీల్ వివరణ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్ . తను అగ్రిమెంట్ చేసానని, సినిమా చేస్తున్నానని చెప్పలేదని, అవకాశం వస్తే వదలను అని మాత్రమే చెప్పానని సునీల్ వివరించినట్లు తెలుస్తుంది . దాంతో సైరా యూనిట్ మరి శాంతించిందో లేదో?