టాలీవుడ్ లో ఒకప్పుడు సూపర్ హిట్ కమెడియన్స్ లో సుధాకర్ ఒకరు. ముఖ్యంగా 1980 లలో ఒక తరహాలో విలనీ కామెడీని పండించి ఆ తర్వాత 1990 నుంచి తన కామెడీని మార్చి కొత్తగా నవ్వించాడు. అప్పట్లో హీరోలకంటే బిజీగా ఉండేవాడు ఈ నటుడు. ఇక మెగాస్టార్ చిరంజీవికి సినీ ఇండస్ట్రీలో ఉండే స్నేహితుల్లో అందరికంటే క్లోజ్ సుధాకర్ అని చెప్పాలి. చిరుతో యముడికి మొగుడు అనే సినిమాకు సుధాకర్ సహ నిర్మాతగా వ్యవహరించారు.

అయితే గత కొంత కాలంగా అయన సినిమాలను చేయడం లేదన్న విషయం అందరికి తెలిసిందే. చివరగా 2005లో వెంకటేష్ సంక్రాంతి సినిమాలో కనిపించిన సుధాకర్ మళ్లీ కనిపించలేదు. ఎందుకంటే ఆయన కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొన్నారు. అప్పట్లో చిరు హాస్పిటల్ కి వెళ్లి మరీ సుధాకర్ ని పలరించారు. అయితే ప్రస్తుతం ఈ 57 ఏళ్ల నటుడు మళ్లీ ఫిట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే కెమెరా ముందు తన నటనను చూపెట్టబోతున్నాడు.

ప్రస్తుతం కొత్తగా తెరకెక్కుతోన్న ‘ఇఈ’  అనే సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్ గా సినిమా ట్రైలర్ కూడా లాంచ్ అయ్యింది. ఈ చిత్రంలో సుధాకర్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో సుధాకర్ తన నటనతో  టాలీవుడ్ రీ-ఎంట్రీ సక్సెస్ కావాలని కోరుకుందాం.