సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులకు ఆసక్తి రేకెత్తిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇప్పటివరకు రంగస్థలం నుంచి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయకపోయినా ఎప్పటికప్పుడు తను నటిస్తున్న రంగస్థలం నుంచి ఫోటోలు రూపంలో అభిమానులను సంతోషపెడుతున్నారు .   ఈ చిత్రం సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్నవిషయం తెలిసిందే.  ఈ చిత్రం కోసం ప్రేక్షకుల్లో ఎంతటి అంచనాలున్నాయో ఫస్ట్ లుక్ కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారో,  మరోవైఫు సుకుమార్ మాత్రం నిదానంగా సినిమా చేస్తూ ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన ప్రత్యేక పల్లెటూరి సెట్లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఆ చిత్రీకరణకు సంబందించిన ఒక ఫోటోను చరణ్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఆ ఫోటోను చూస్తుంటే పండుగ వాతావరణాన్ని తలపిస్తూ పాట మంచి మాస్ తరహాలో ఉంటుందేమో అనిపిస్తోంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 1985 ల కాలంలో జరగబోయే ప్రేమ కథగా ఉండనున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.