సిద్ధార్థ్‌, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్స్‌పై సిద్ధార్థ్‌, ఆండ్రియా తారాగణంగా రూపొందిన హారర్‌ చిత్రం ‘గృహం’. మిలింద్‌ రావ్‌ దర్శకుడు. ఈ సినిమా నవంబర్‌ 3న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాని, సిద్ధార్థ్‌, తమన్‌ ఎస్‌.ఎస్‌, డైరెక్టర్‌ మిలింద్‌ రావ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ గిరీష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్‌ను ప్రదర్శించారు. నేచురల్‌ స్టార్‌ నాని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా… హీరో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ – ”నాకు హారర్‌ జోనర్‌ సినిమాలంటే చాలా ఇష్టం. హారర్‌ చిత్రాలకు హీరో అవసరం ఉండదు. భయమనే ఎలిమెంటే హీరో. కొత్తగా చేయాలని ఆలోచనతో ఈ సినిమాపై వర్క్‌ చేసి సినిమా చేస్తున్నాం. హారర్‌ సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. సినిమాను రెండు వందల మంది స్నేహితులకు చూపించి, ఎక్కడెక్కడ ప్రేక్షకుల భయపడతారు? ఎక్కడ భయపడరు? అనే విషయాలను చూసుకుని కరెక్ట్‌ చేసుకుని సినిమా తెరకెక్కిస్తూ వచ్చాం. నాలుగున్నరేళ్లు సినిమా స్క్రిప్ట్‌ పై వర్క్‌ చేశామంటే మేం పడ్డ కష్టం అర్థం చేసుకోవాలి. గిరీష్‌ చాలా మంచి సంగీతం, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. నాకు, మిలింద్‌గారికి రామ్‌గోపాల్‌ వర్మ అంటే ఎంతో ఇష్టం. హారర్‌ సినిమాలకు గాడ్‌ఫాదర్‌ అయిన ఆయన డైరెక్ట్‌ చేసిన దెయ్యం, భూత్‌ సినిమాల తర్వాత ఆ రేంజ్‌ను ఏ సినిమాలు రీచ్‌ కాలేదు. మా సినిమా రీచ్‌ అవుతుందని మేం అనుకుంటున్నాం. బొమ్మరిల్లు సినిమాలో మొత్తం మీరే చేశారు అనే డైలాగ్‌కు ఎంత మంచి రెస్పాన్స్‌ వచ్చిందో, రేపు ఈ సినిమాకు కూడా అలాంటి రెస్పాన్సే వస్తుంది. ఒక డాక్టర్‌ తన భార్యతో కలిసి హిమాచల్‌ ప్రదేశ్‌కు వెళతాడు. వాళ్లుండే పక్కింట్లో మరో ఫ్యామిలీ ఉంటుంది. అందులో ఓ అమ్మాయి కారణంగా వచ్చే సమస్యలే ఈ సినిమా ప్రధానమైన కథ. సినిమా చూసి ప్రేక్షకులు థ్రిల్‌ అవుతారు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే బాగానే సినిమాను ఆస్వాదిస్తారు. భయానికి భాష అక్కర్లేదు కాబట్టి, ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. తెలుగు ఇండస్ట్రీ నన్ను హీరోగా ఎంతో బాగా ఆదరించింది. తెలుగులో సినిమాలు చేయడం కాస్త ఆలస్యమై ఉండొచ్చు కానీ, మిస్‌ మాత్రం కాను” అన్నాను. 

Gruham movie trailer