అక్కినేని నాగ చైతన్య సమంతను పెళ్లి చేసుకున్న తర్వాత తన తొలి బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు నవంబర్ 23 న పుట్టినరోజు అనగా రేపే . ఈ సందర్భంగా చైతూ కోసం స్పెషల్ ప్లాన్స్ సిద్ధం చేస్తోంది సమంత. తన భర్తకు కలకాలం గుర్తుండిపోయేలా ట్రీట్ ఇవ్వాలని భావిస్తోంది.
ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా ఓ తమిళ సినిమాలో నటిస్తోంది సమంత. ఈమధ్యే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. రేపు ఒక్కరోజు ఈ షూటింగ్ కు సెలవు పెట్టింది సమంత. రేపంతా నాగచైతన్యతోనే గడపాలని నిర్ణయించుకుంది.

నిజానికి పెళ్లిరోజులా ఈ పుట్టినరోజును కూడా డెస్టినేషన్ బర్త్ డే గా ప్లాన్ చేసింది ఈ జంట. ఎటైనా ఓ మంచి ప్రదేశానికి వెళ్లిపోయి వేడుకలు చేసుకోవాలనుకుంది. కానీ సమంత, నాగచైతన్య ఇద్దరూ బిజీగానే ఉన్నారు. సమంత చేతిలో 3 సినిమాలుంటే, సవ్యసాచి షూటింగ్ తో చైతూ కూడా బిజీగా ఉన్నాడు. సో.. ఈ స్పెషల్ బర్త్ డేను హైదరాబాద్ లోనే సెలబ్రేట్ చేసుకోవాలని వీళ్లిద్దరూ నిర్ణయించారు.

చైతూ కోసం సమంత ప్లాన్ చేసిన ఆ సర్ ప్రైజ్ ఏంటనే విషయం కచ్చితంగా అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే.. ప్రత్యేకమైనది ఏదైనా సోషల్ మీడియాలో షేర్ చేయడం సమంతకు అలవాటు. ఈ బర్త్ డే పిక్స్ ను కూడా సమంత అలానే పోస్ట్ చేయడం గ్యారెంటీ. అలాగే చైతూకి కూడా అడ్వాన్స్  పుట్టినరోజు శుభాకాంక్షలు .