యంగ్ హీరో నాగ శౌర్య, ‘ఫిదా’ తో తెలుగు తెరకు పరిచయమై బాగా పాపులర్ అయిన సాయి పల్లవి కలిసి నటించిన చిత్రం ‘కణం’. ఏక కాలంలో తమిళ, తెలుగు రెండు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు.
హార్రర్  జానర్లో ఉండనున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ తోనే మంచి అంచనాల్ని క్రియేట్ చేసుకుంది.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశ పనుల్లో ఉన్న ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 18న ప్రముఖ హీరో యాక్టర్ కమ్ డాన్సర్ ప్రభు దేవా చేతుల మీదుగా  విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా తెలియ చేశారు . తమిళంలో ‘కారు’ పేరుతో రానున్న ఈ సినిమాకు రజనీ ‘2.0’ సినిమాటోగ్రాఫర్ నిర్వాణ సాహ కెమెరా వర్క్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరొక విశేషమేమిటంటే ఇందులో సాయి పల్లవి 4 ఏళ్ల పాపకు తల్లిగా నటించనుంది.