వెండితెర నుంచి బుల్లితెరకు తారలు సందడి సందడి చేస్తూ ప్రేక్షకులకు చేరువవుతున్నారు. చాలాకాలం తర్వాత తెలుగు జనాల్ని ‘బుల్లితెర’ ద్వారా పలకరించిన రేణు దేశాయ్‌, మనసులో మాటని బయటపెట్టింది. ‘స్టార్‌ మా’ ఛానల్‌లో ‘నీతోనే డాన్స్‌’ అనే డాన్స్‌ ప్రోగ్రామ్‌కి జడ్జ్‌గా వ్యవహరిస్తున్న రేణుదేశాయ్‌, మీడియా ముందుకొచ్చి, తన గురించీ, పవన్‌కళ్యాణ్‌ గురించీ చాలా విషయాలే చెప్పింది. రాజకీయాల్లోనూ పవన్‌ రాణిస్తాడంటోన్న రేణు దేశాయ్‌, పవన్‌తో వైవాహిక బంధం తెగిపోయినా, ఆయనంటే గౌరవం ఎప్పటికీ అలాగే వుంటుందని అంటోంది.
”పవన్‌కళ్యాణ్‌తో విడాకుల సందర్భంగా పెద్దమొత్తంలో డబ్బు, ఇతర ఆస్తులు ఆయన్నుంచి తీసుకున్నానని నా మీద అసత్య ప్రచారం చేస్తూనే వున్నారు. కానీ, నిజమేంటో నాకు తెలుసు. మోడలింగ్‌, సినీ రంగాల్లో వున్నప్పుడే ఆర్థికంగా నేను నిలదొక్కుకున్నాను. ఆ సమయంలోనే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టారు.. అవిప్పుడు నాకు ఆర్థికంగా వెన్ను దన్నుగా నిలిచాయి..” అంటోంది పవన్‌కళ్యాణ్‌ మాజీ సతీమణి, ఒకప్పటి హీరోయిన్‌ రేణు దేశాయ్‌.

రాజకీయాల్లో పవన్‌కి మద్దతిస్తారా.? ఆయన తరఫున ప్రచారం చేస్తారా.? అన్న ప్రశ్నలకు, ‘మీడియాలో మాట్లాడగలను.. సోషల్‌ మీడియాలో స్పందించగలను.. అంతకన్నా ఇంకేం చేయగలను.? పవన్‌ ఓ పెద్ద స్టార్‌… ఆయనుకున్న ఫాలోయింగ్‌ ముందు, నా సపోర్ట్‌ ఆయనకు అవసరం లేదేమో..’ అని తేల్చేసింది.