రంగస్థల కథానాయకుని ఆలస్యం

RC's rangasthalam getting delay

340

మెగా స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడాని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. నెక్ట్స్ రానున్న మెగా మూవీ ఇదే. చిరు సినిమాకు మొన్నే పూజ చేశారు. పవన్ కళ్యాణ్ మూవీ సంక్రాంతికి వస్తుందన్నారు. అల్లు అర్జున్ మూవీకి టైం ఉంది. వీటికంటే ముందే.. డిసెంబర్ లోనే సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రంగస్థలం 1985 వస్తుందనే టాక్ వినిపించింది.

అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ముందు నుంచీ సందిగ్ధత నెలకొంది. సంక్రాంతికి అని ముందుగా చెప్పినా.. బాబాయ్ అబ్బాయ్ ఒకేసారి పోటీపడటం ఇష్టం లేక డేట్ మార్చుకోవాల్సి వచ్చింది. పోస్ట్ పోన్ కు బదులు ప్రీపోన్ చేసుకుంటారని.. చెర్రీ లేటెస్ట్ హిట్ ధృవ మాదిరిగా డిసెంబర్ లోనే మూవీ వచ్చేస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ రంగస్థలంను ఏకంగా ఏప్రిల్ కు పోస్ట్ పోన్ చేసేశారట. ఏప్రిల్ 20ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకున్నారని అంటున్నారు. ఈ మేరకు యూనిట్ అంతా ఫిక్స్ అయిపోయారట కూడా. అందుకు తగినట్లుగానే పోస్ట్ ప్రొడక్షన్స్ కోసం ప్లానింగ్ కూడా జరుగుతోందని సమాచారం.

ఓ సినిమా కొన్ని వారాలు వాయిదా పడితే ఏదో ఆలస్యం అనుకోవచ్చు కానీ.. ఏకంగా నాలుగు నెలలు అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఆ సినిమాలో మరో సినిమా చేసేయచ్చు కూడా. మరి ఇంతాలస్యం జరగడానికి కారణం.. షూటింగ్ ప్రోగ్రెస్ అంటున్నారు. తను నిర్మాతగా తీసిన దర్శకుడు మూవీ ప్రమోషన్స్ కోసం షెడ్యూల్ ను కొంత డిస్టర్బ్ చేశాడట రంగస్థలం డైరెక్టర్ సుకుమార్. మరోవైపు.. చెర్రీ కూడా ఏం తక్కువ కాదని అంటున్నారు. 200 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్న మెగాస్టార్ మూవీ సై రా నరసింహారెడ్డికి చెందిన పనుల్లో బిజీగా అయిపోయాడట రామ్ చరణ్. మొత్తానికి హీరో-డైరెక్టర్ ఇద్దరూ కలిసి.. రంగస్థలం మూవీ రిలీజ్ లేట్ చేసేస్తున్నారని టాక్.