మెగా స్టార్ రామ్ చరణ్ నుంచి ఒక దసరా కనుక రాబోతున్నది. రామ్ చరణ్-సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘రంగస్థలం 1985’. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లి ఏడెనిమిది నెలలవుతోంది. ఇప్పటిదాకా కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు. అప్పుడప్పుడూ ఆన్ లొకేషన్ పిక్స్ కొన్ని రిలీజ్ చేశారు తప్పితే.. ఇప్పటిదాకా అఫీషియల్ లుక్ ఏదీ బయటికి రాలేదు.  మెగా అభిమానులు ఫస్ట్ లుక్ కోసం ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే  ప్రేక్షకుల ఎదురుచూపులకు కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ కోసం ముహూర్తం కుదిరినట్లు టాలీవుడ్ సమాచారం. ఇందులో సుకుమార్ మార్కు ఉంటుందని.. కచ్చితంగా మెగా అభిమానుల్ని ఈ లుక్ అలరిస్తుందని అంటున్నారు. అందులో రామ్ చరణ్ బాబాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా పవన్ తమ కుటుంబ వేడుకలకు దూరంగా ఉంటూ వచ్చారు. మరి ఇప్పుడు ఫస్ట్ లుక్ కోసం వస్తారో లేదో అనేది వేచి చూడాల్సిందే  మొత్తానికి ఇటు చరణ్ అభిమానులకు అటు పవన్ అభిమానులకు ఈ దసరా పెద్ద పండగే .
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరెక్కుతున్న ‘రంగస్థలం 1985’ను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. ఐతే ఈ మధ్య కొంచెం సందేహాలు మొదలయ్యాయి. మరి ఫస్ట్ లుక్ లాంచ్ సందర్భంగా రిలీజ్ విషయంలో క్లారిటీ ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే.