శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో ఎనర్జిటిక్ హీరో రామ్, త్రినాథ‌రావు న‌క్కిన కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం

Energetic Star Ram - Trinadha Rao Nakkina - Dil Raju. Shooting begins from February 2018. Ram16

312

ఈ ఏడాది ఇప్ప‌టికే ఐదు సినిమాల స‌క్సెస్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద నిర్మాత‌గా ..త‌న సెల‌క్ష‌న్ ఆఫ్ మూవీస్ గురించి చెప్ప‌క‌నే చెప్పిన దిల్‌రాజు..ఇదే ఏడాది విడుద‌ల కానున్న ఎం.సి.ఎ చిత్రంతో డ‌బుల్ హ్యాట్రిక్‌ను సాధించ‌నున్నారు. ఇదే ఊపులో వ‌చ్చే ఏడాది ఎన‌ర్టిటిక్ హీరో రామ్  హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో ఓ సినిమా రూపొందిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ 2017 ప్రారంభంలో విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించిన నేను లోక‌ల్‌ సినిమా ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నారు.

రామ్ ఎన‌ర్జీకి, త్రినాథ‌రావు న‌క్కిన టేకింగ్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  మేకింగ్ వాల్యూస్ తోడు కావ‌డం సినిమాకు పెద్ద ప్ల‌స్ అవుతుందన‌డంలో సందేహం లేదు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్ ప్రారంభం కానుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రం లో చాలా కీలకమైన పాత్ర ఒకటి పోషిస్తున్నారు. ఒక ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రం లో నటిస్తారు. ఈ చిత్రానికి కధ ప్రసన్న కుమార్ బెజవాడ అందిస్తున్నారు. సాయి కృష్ణ రచనా సహకారం అందిస్తారు.  ఒక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పని చేయనున్నారు. ఇతర టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని నిర్మాణ సంస్థ తెలియ‌జేసింది.

Nani & Sai Pallavi starrer MCA releasing worldwide on 21st December

MCA (Middle Class Abbayi) TEASER