మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న రాజా ది గ్రేట్ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడీ ప్రాజెక్టులోకి మరో హీరోయిన్ కూడా ఎంటరైంది. రాజా ది గ్రేట్ సినిమాలోకి ఎంటరైనట్టు రాశి ఖన్నా ప్రకటించింది. ఈ సినిమాలో “షార్ట్ అండ్ స్పెషల్” ఎప్పీయరెన్స్ ఇవ్వబోతున్నట్టు రాశి ప్రకటించింది. గతంలో రవితేజ-రాశి కాంబోలో బెంగాల్ టైగర్ వచ్చింది.

నిజానికి హీరోను చూసి ఇలాంటి అతిథి పాత్రలకు ఒప్పుకుంటారు ఎవరైనా. కానీ రాశి మాత్రం దర్శకుడ్ని చూసి ఒప్పుకుంది. గతంలో అనిల్ రావిపూడి డైరక్ట్ చేసిన సుప్రీమ్ సినిమాలో మంచి రోల్ చేసింది రాశి ఖన్నా. ఆ మూవీలో ఆమె చేసిన బెల్లం శ్రీదేవి క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఆ అభిమానంతో రాజా ది గ్రేట్ సినిమాలో ఓ పాటలో కనిపించేందుకు అంగీకరించింది.

రాశి కంటే ముందే ఈ సినిమాలోకి ఓ స్పెషల్ గెస్ట్ వచ్చి చేరాడు. అతడే రవితేజ కొడుకు మహాథన్. ఈ సినిమాలో చిన్ననాటి రవితేజ పాత్రతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు మహాధన్. ఇప్పుడు రాశి చేరికతో సినిమాకు ఎక్స్ ట్రా కలరింగ్ తోడైంది.