కంగనా రనౌత్ బాలీవుడ్ సూపర్ హిట్ ‘క్వీన్’ సినిమా తమిళ రీమేక్ లో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పారిస్ లో మొదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి కాజల్ అగర్వాల్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది . అందులో కాజల్ మోడర్న్ లుక్ లో సెక్సీగా కనిపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టింది. అయితే ‘క్వీన్’ సినిమా చూసి మెస్మరైజ్ అయిన జనాలు మాత్రం కాజల్ ఈ లుక్ చూసి షాకయ్యారు.

ఓ సామాన్యమైన యువతిగా కంగనా రనౌత్ కనిపించిన తీరుకు.. ఇక్కడ కాజల్ లుక్ కు అసలు సంబంధమే లేనట్లుగా అనిపించింది. కంగనాలో ఉన్న సింప్లిసిటీ కాజల్ లో అసలేమాత్రం కనిపించకపోవడంతో ‘క్వీన్’ సినిమా రీమేక్ కు ఆమెను తీసుకుని తప్పు చేశారన్న అభిప్రాయం కలిగింది.

దీనితో చిత్ర బృందం కాజల్ కొత్త లుక్ ఒకటి రిలీజ్ చేశారు. ఇందులో కాజల్ సింపుల్ లుక్ లోనే కనిపిస్తోంది. చుడీదార్లో ఒక మామూలు అమ్మాయిలా ఉంది కాజల్. దీంతో ‘క్వీన్’ ప్రేమికులు కొంచెం శాంతించారు. ‘క్వీన్’ తెలుగు వెర్షన్ కు ‘క్వీన్’ అనే టైటిల్ నే ఖాయం చేయగా తమిళంలో ‘ప్యారిస్ ప్యారిస్’ అని పేరు పెట్టారు. తెలుగులో తమన్నా.. తమిళంలో కాజల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. తెలుగు-తమిళ వెర్షన్లకు నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు . కన్నడలో పారుల్ యాదవ్ ప్రధాన పాత్ర పోషిస్తుంటే.. మలయాళంలో మాంజిమా మోహన్ కథానాయిక. ఆ రెండు వెర్షన్లకూ రమేష్ అరవింద్ దర్శకుడు.