యంగ్ హీరోస్ కు వాళ్ళ టాలెంట్ ను టాలీవుడ్ కు పరిచయం చేయడంలో పూరి తరువాతే ఎవరైనా త్వరగా చిత్రాలను పూర్తి చేయడం లోనూ పూరి తరువాతే అని అందరికి తెలిసిందే బాలయ్యతో చేసిన పైసా వసూల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ముస్కాన్. పూరి స్థాపించిన ‘పూరి కనెక్ట్’ అనే కంపెనీ నుంచి ఈ అమ్మడు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడిదే సంస్థ మరోసారి నటీనటుల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది.
18-50ఏళ్ల మధ్య వయసున్న పురుషులు, 18-45 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఎవరైనా పూరి కనెక్ట్ ను సంప్రదించవచ్చు. ఎటొచ్చి వాళ్ల దగ్గర యాక్టింగ్ టాలెంట్ ఉండాలి. తన కొత్త సినిమాకు వాళ్లు పనికొస్తారని తెలిస్తే వెంటనే అగ్రిమెంట్ చేసుకోడానికి సంస్థ రెడీగా ఉంది.
ఈ వ్యవహారాలన్నింటినీ చార్మి పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే నటీనటుల ఎంపికకు సంబంధించి తుది నిర్ణయం మాత్రం పూరిజగన్నాధ్ దే. ఫైనల్ లిస్ట్ తయారుచేయడం వరకు చార్మి పని.

వచ్చే నెలలో తనయుడు ఆకాష్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు పూరిజగన్నాధ్. కొడుకు కోసం ఓ డిఫరెంట్ లవ్ సబ్జెక్ట్ రాసుకున్నాడు. ఆ సినిమా కోసమే ఈ కాస్టింగ్ కాల్.