ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజిత్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్‌ కథానాయిక శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తోంది. మంగళవారం నుంచి ఆమె సెట్లో అడుగుపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ సాగుతోంది. ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌లపై ఓ ఫ్యాక్టరీ నేపథ్యంలో సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. శ్రద్ధా సెట్లో అడుగుపెట్టింది ఇప్పుడే అయినా.. వారం రోజుల నుంచీ హైదరాబాద్‌లోనే ఉంటోంది. స్క్రిప్టుని దగ్గర పెట్టుకొని సంభాషణలు ఎలా పలకాలో నేర్చుకొంటోందట. తెలుగులో శ్రద్దాకపూర్‌ నటిస్తున్న తొలి చిత్రం ఇది.

కాబట్టి తెలుగు భాషపై పట్టు సంపాదించడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ తెలుగు మాస్టారునీ నియమించుకొందట. యాక్షన్‌ సన్నివేశాలకు ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్లు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.

కేవలం యాక్షన్‌ సన్నివేశాల కోసమే రూ.20 కోట్లపైచిలుకు బడ్జెట్‌ కేటాయించారట. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు.