ఫిలిం ఇండస్ట్రీ లో లక్ ఎప్పుడు ఎవరిని ఎలా అందలం ఎక్కిస్తుందో ఎవరు ఊహించరు కానీ అదేంటో.. అందాల పూజా హెగ్డే విషయంలో మాత్రం ఇది రివర్స్ లో ఉంది. భారీ సక్సెస్ లు సాధించలేకపోయినా.. పూజాకు క్రేజీ ప్రాజెక్టులు మాత్రం వచ్చి ఒళ్లో వాలుతున్నాయి.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఒకటి రెండు చిత్రాలు చేసిన ఈ సుందరికి.. ఏకంగా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి లీడ్ హీరోయిన్ గా మొహెంజొదారో మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది. మంచి ఛాన్సే అయినా సక్సెస్ మాత్రం అందుకోలేక నిరుత్సాహపడిన పూజా హెగ్డేకు.. అంతలోనే సౌత్ నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. ఈ సారి డీజేలో నటించమంటూ బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు అల్లు అర్జున్. ఈ మూవీతో గ్లామర్ డాల్ అనిపించుకున్నా.. హిట్టు ఒడ్డుకు మాత్రం చేరలేదు. ఇదే సమయంలో భారీ రెమ్యూనరేషన్ తో వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ మూవీలో నటిస్తోంది పూజా. ఇలా తెలుగులో ఓ చిన్న హీరోతో నటిస్తున్న భామకు.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తో నటించే అవకాశం వచ్చింది.

ఏకంగా రేస్3 మూవీలో ఈమెను సెకండ్ హీరోయిన్ గా ఫైనల్ చేసేశారట కూడా. అంటే ఇక్కడ భారీ సక్సెస్ అందుకోకపోయినా.. మళ్లీ బాలీవుడ్ లో భారీ చిత్రంలో అది కూడా సల్మాన్ మూవీలో ఛాన్స్ పట్టేసింది. ఇదే సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లీడ్ హీరోయిన్ కాగా.. పూజా హెగ్డే సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించనుంది.