ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సంవత్సరం శతమానం భవతి నుంచి మొన్నటి ఫిదా చిత్రం వరకు తన ప్రొడక్షన్ ఖాతాలో హిట్ హ్యాట్రిక్ సాధించాడు. ఇప్పటికే ఈ ఏడాది దసరాకి జై లవకుశ , స్పైడర్ చిత్రాలతో బిజీ గా ఉన్నాడు. ఇప్పుడు తన తదుపరి చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి పవర్ స్టార్ చిత్రంతో రానున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నది. ఇప్పటికే ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు మరి ఈ క్రేజ్ ఎంతవరకు వెళ్ళిందంటే ప్రీరిలీజ్ బిజినెస్ నైజాం హక్కులు 29కోట్లతో దిల్ రాజు నే సొంతం చేసుకున్నారు అది కూడా ఏకంగా బాహుబలి బిజినెస్ రికార్డ్స్ నే బ్రేక్ చేస్తోంది . ఇప్పటివరకు బాహుబలి రికార్డ్స్ ను ఏ చిత్రం చేరుకోలేదు . పవన్ మూవీ ఇంకెన్ని రికార్డులు సొంతం చేసుకోనున్నదో వేచి చూడాల్సిందే!