పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ ల కాంబోలో ‘అజ్ఞాతవాసి’ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ 25 వ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాపై  స్పెషల్ ఫోకస్ పెట్టాడు. జల్సా అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. త్వరలో వారణాసిలో ఈ సినిమా చివరి షెడ్యూల్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ – అనిరుధ్ కంపోజ్ చేసిన ‘బయటికొచ్చి’ చూస్తే లిరికల్ సాంగ్ – హీరోయిన్ కీర్తి సురేశ్ -పవన్ ల లుక్స్ …ఈ సినిమా పై అంచనాలు మరింత పెంచాయి. అయితే ఇప్పటివరకు ఈ చిత్ర ఫస్ట్ లుక్ బయటికి రాకపోవడమే కాకుండా పలుమార్లు వాయిదా పడడం అభిమానులను నిరుత్సాహపరిచింది. అయితే వారందరికీ డబుల్ ధమాకా ఇచ్చేందుకు  ‘అజ్ఞాతవాసి`  చిత్ర యూనిట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 20 రోజుల వ్యవధిలో ఆ చిత్ర ఫస్ట్ లుక్ – ఆడియోను రిలీజ్ చేసి పవన్ అభిమానులను మెస్మరైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ టాక్.

ఈ నెల 25వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ చిత్ర ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయ్ . ఇప్పటికే విడుదలైన  ‘బయటికొచ్చి’ చూస్తే  పాటకు రికార్డు స్థాయిలో స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్ర ఆడియోను వచ్చేనెల 15వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాను జనవరి 10వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే జనవరి 9న సెకెండ్ షోతో ఆ సినిమా విడుదల కాబోతోందని టాక్ వస్తోంది. హైదరాబాద్ లో బెనిఫిట్ షో లకు అనుమతులు లభించడం కష్టమవుతోంది. దీంతో జనవరి 10 న మిడ్ నైట్ – ఎర్లీ మార్నింగ్ షోలకు బదులుగా జనవరి 9 సెకండ్ షో తోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట. గతంలో బాహుబలి 2ను కూడా ఇలాగే విడుదల చేశారు.

18 mins