యంగ్ హీరో మంచు మనోజ్ హీరోగా అజయ్ అండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో  ‘ఒక్కడు మిగిలాడు’ అనే చిత్రంతో త్వరలోనే మన ముందుకురానున్నారు. గత కొన్నాళ్ళుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మనోజ్ ఈ చిత్రంతో నన్నమళ్లీ హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు,  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా తాలూకు టీజర్, ట్రైలర్లు మంచి ఆదరణ దక్కించుకోవడంతో పాటు సినిమాపై బోలెడంత క్రేజ్ ను క్రియేట్ చేశాయి. దీంతో చిత్ర టీమ్ నిన్ననే ఒక పాటను రిలీజ్ చేసి త్వరలోనే రెండవ ట్రైలర్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
నవంబర్ 1 ఉదయం 9 గంటలకు రిలీజ్ కానున్న ఈ ట్రైలర్ కూడా మొదటి ట్రైలర్ లాగనే మంచి ఇంటెన్సిటీతో, భావోద్వేగాలతో నిండి ఉంటుందని మనోజ్ తెలిపారు.  ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీవీ చీఫ్ ప్రభాకరన్ పాత్రలోనూ, స్టూడెంట్ లీడర్ పాత్రలోను కనిపించనున్నాడు. ఎస్.ఎన్ రెడ్డి, లక్ష్మి కాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.