ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిన మెగా హీరోయిన్ నిహారిక కొంత విరామం తరువాత హ్య‌పీ వెడ్డింగ్ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. హ్యాపీ వెడ్డింగ్ చిత్రం ఈ నెలాఖ‌రులో లేదా వ‌చ్చే నెల ఆరంభంలో విడుద‌ల కానుంది. ల‌క్ష్మణ్ కర్య ఈ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, నిహారిక హీరో హీరోయిన్స్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ట్టు తెలుస్తుంది. పల్లెటూరు… ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వేలంటైన్స్ డే సంద‌ర్భంగా మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఇది మెగా ఫ్యాన్స్‌లో వైబ్రేష‌న్స్ క‌లుగజేస్తుంది. ఇక నిహారిక ఒరు నల్ల నాల్ పాతు సోల్రెన్ అనే టైటిల్‌తో రూపొందుతున్న త‌మిళ‌ చిత్రంలోను న‌టిస్తుంది. మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండ‌గా, నిహారిక‌ రెండు వైవిధ్యమైన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్ .