తాజాగా విడుదలయిన ‘యుద్ధం శరణం’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన హీరో అక్కినేని నాగ చైతన్య తన తర్వాతి ప్రాజెక్ట్స్ కోసం రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి డైరెక్ట్ చేయనున్న ‘సవ్యసాచి’ ఇంకొకటి మారుతి దర్శకత్వంలో ఉండనుంది. మారుతి సినిమాలో హీరోయిన్ గా మేఘా ఆకాష్ ను తీసుకోనున్నారని ప్రస్తుతం టాలీవుడ్ టాక్.
అయితే చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నితిన్ తాజా చిత్రం ‘లై’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన మేఘా ఆకాష్ పెర్ఫార్మెన్స్ పట్ల తెలుగుప్రేక్షకులు బాగానే ఇంప్రెస్ అయ్యారు. ప్రస్తుతం ఈమె పవన్, త్రివిక్రమ్ ల ప్రోడక్షన్లో కృష్ణ చైతన్య డైరెక్షన్లో నితిన్ చేస్తున్న సినిమాలో కూడా నటిస్తోంది. మరి చైతూతో జోడీ కట్టనున్న మేఘా ఆకాష్ కి ఈ సినిమాతో నన్న మంచి బ్రేక్ రావాలని ఆశిద్దాం !