యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తోన్న జై లవకుశ చిత్రంతో మన ముందుకు త్వరలో వస్తున్న విషయం అందరికి తెలిసిందే , ఈ చిత్ర ప్రమోషన్స్‌ లో కూడా కొత్త పోస్టర్లు, టీజర్లు రిలీజ్‌ చేస్తూ ప్రేక్షకుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నారు చిత్రబృందం . ఈ చిత్రానికి బాబీ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు .

ఇప్పటికే ఈ చిత్రానికి హైప్‌ బాగా వుంది. తాజాగా ఈ చిత్రానికి మరింత హీట్‌ జోడిస్తూ తమన్నా వచ్చి చేరింది. ఇందులో ఒక ఐటెమ్‌ సాంగ్‌లో తమన్నా మెరవనుంది. ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఒక ప్రత్యేక గీతంలో సూపర్‌ హాట్‌ తమన్నా కూడా యాడ్‌ అయ్యేసరికి ఈ చిత్రానికి మరింత గ్లామర్‌ తోడయింది.

ఇప్పటికే పలు చిత్రాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌లో మెరిసిన తమన్నాకి ఈ పాట కోసం బాగానే చెల్లిస్తున్నారట. జనతా గ్యారేజ్‌ చిత్రానికి కాజల్‌ పాట ఎంత ప్లస్‌ అయిందో దీనికీ ఈ పాట ఆ స్థాయిలో అడ్వాంటేజ్‌ అవుతుందని అంటున్నారు. మసాలా అంశాల పరంగా ఏమాత్రం లోటు రాకుండా చూసుకుంటూ ఈసారి ఎన్టీఆర్‌ చిత్రాన్నిమాస్ కి దగ్గరగా తీసుకెళ్లేందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు.