స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమా నాపేరు సూర్యపైనే ఫోకస్ మొత్తం పెట్టాడు. నా ఇల్లు ఇండియా అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.  ఇప్పుడు ఈ చిత్రాన్ని మెగా అభిమానులను మురిపించేలా మరో మెగా హీరో రామ్ చరణ్ తేజ్ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

దువ్వాడ జగన్నాథమ్ అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడంతో నాపేరు సూర్య సినిమా కథను మలుపు తిప్పే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నాడనేది టాక్. ఈ సినిమాను నిర్మిస్తోంది నాగబాబు. బాబాయి నిర్మిస్తున్న సినిమా కావడంతోపాటు హీరో కూడా అల్లు అర్జున్ కావడంతో  ఈ పాత్ర చేయడానికి రామ్ చరణ్ సుముఖంగా ఉన్నాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. రామ్ చరణ్ ధృవ సినిమా కోసం కసరత్తులు అవీ బాగా చేసి బాడీ బాగా బిల్డప్ చేశాడు. ఆ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో రామ్ చరణ్ బాగా మెప్పించాడు. ఈ లుక్ ఆర్మీ ఆఫీసర్ గా కూడా బాగా నప్పుతుంది. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం-1985 సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం గడ్డం బాగా పెంచాడు. దాంతో రంగస్థలం పూర్తయిన తర్వాత నా పేరు సూర్యలో యాక్ట్ చేసే అవకాశం ఉంది.

ఇంతకుముందు రామ్ చరణ్ – అల్లు అర్జున్ కలిసి పైడిపల్లి వంశీ డైరెక్షన్ లో ఎవడు సినిమాలో నటించాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ హీరో కాగా.. అల్లు అర్జున్ స్పెషల్ రోల్ చేశాడు. ఆ పాత్ర సినిమాకు బాగా ప్లస్సయ్యింది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకు కూడా రామ్ చరణ్ స్పెషల్ అప్పియరెన్స్ అట్రాక్షన్ అవుతుందని నాపేరు సూర్య యూనిట్ వర్గాలు అంటున్నాయి.