‘తొలిప్రేమ’ ‘హ్యాపీ’ ‘ఉల్లాసంగా ఉత్హాహంగ’ వంటి హిట్ ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు కరుణాకరన్   హృదయానికి హత్తుకునే ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా ఆయనకి మంచి గుర్తింపు ఉందన్న విషయం తెలిసిందే, తాజాగా ఈ డైరెక్టర్ సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కే.ఎస్ రామారావ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డార్లింగ్ స్వామి ఈ సినిమాకు మాటలు అందిస్తున్నారు.
ఈ మద్యనే ఈ సినిమా మొదలైంది. చిత్ర రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది నుండి మొదలుకానుంది. ఫుల్ కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సాయిధరమ్  కెరీర్లో పెద్ద విజయం సాదిస్తుందని చెప్పవచ్చు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారని తెలిసింది. ‘ప్రేమమ్, ఊపిరి, నిన్నుకోరి’ వంటి విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించిన గోపి సుందర్ ఈ సినిమాకు పని చెయ్యడం విశేషం. సాయి ధరమ్ తేజ్ కు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. అనుపమకు కూడా ఈ మూవీతో మెగా కాపౌండ్ లోకి ఎంటర్ అవబోతున్నది.