టాలీవుడ్ మెగా హీరోలంటే అందరికి క్రేజే ప్రస్తుతం ప్రతి రెండు నెలల్లో ఎదో ఒక మెగా హీరో సినిమా విడుదల అవుతూనే ఉంది, కాని వచ్చే  నెల నుండి ప్రతీ నెల ఒక మెగా హీరో సినిమా విడుదల కాబోతుంది.
డిసెంబర్ 1న మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ నటించిన ‘జవాన్’ విడుదల కాబోతుంది. బివిఎస్.రవి ఈ సినిమాకు దర్శకుడు, జనవరి 10న పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ విడుదల కాబోతుంది. మెగా పవర్ స్టార్ పవన్& త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. నూతన దర్శకుడు వెంకి అట్లూరి తో మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ చేసిన సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. తమన్ సంగీతం ఈ సినిమాకు హైలెట్ కానుందని అంచనా. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ ఏప్రిల్ 27న విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ మార్చి 29 న రిలీజ్ కానుందని సమాచారం. ఇలా వచ్చే ఏడాది సగం వరుకు వరుసగా మెగా హీరోల సినిమాలు విడుదల అవుతుండడం అభిమానులకు విశేషమనే చెప్పాలి.