ఘట్టమనేని మంజుల విభిన్న కథాంశాలతో షో’, ‘నాని’, ‘కావ్యాస్ డైరీ, పోకిరి’ వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈమె సూపర్ స్టార్ కృష్ణ గారి కుమార్తె మహేష్ బాబు కు స్వయానా సోదరి అనే విషయం అందరికి తెలిసిందే . ప్రస్తుతం ఆమె సందీప్ కిషన్ తో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాకు ఆమే స్వయంగా దర్శకత్వం వహిస్తుండడం విశేషం. జెమిని కిరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది మే లో ప్రారంభం అయ్యింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా లో మంజుల కుమార్తె జాన్వీ నటిస్తోంది. రేపు మంజుల తన సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించబోతోంది. అయితే ఆమె దర్శకత్వం వహిస్తున్న సినిమా గురించి చెప్పబోతుందో, లేక వేరే కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడబోతోందా అనేది చూడాలి. దర్శకత్వం వహించాలనే కోరిక ఎప్పటి నుండో ఉన్నా నటనలో బిజీగా ఉండడంతో మంజల ఇంత కాలం దర్శకత్వం వహించలేదని ఆమె ఇచ్చిన ఒక తాజా ఇంటర్వ్యూ లో వెల్లడించింది.