ప్రిన్స్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగును పోస్టుపోన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైయిన ‘స్పైడర్’ రిజల్టు ఎలా ఉండోబోతుంది అని ఎదురు చూస్తున్నారు అందరూ . అయితే ఇప్పటికే సినిమా ఫైనల్ కలక్షన్ ఎలా ఉండబోతుందో ఒక రకంగా అర్ధమైపోయింది. అందుకే ఇప్పుడు మహేష్ బాబు కూడా తన తదుపరి అడుగులను కాస్త జాగ్రత్తగా వేయాలని డిసైడ్ అయ్యాడట.

‘స్పైడర్’ రిజల్టు చూసుకున్నప్రిన్స్ ‘భరత్ అను నేను’ సినిమా షూటింగును పోస్టుపోన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మొన్నటివరకు సంక్రాంతి రేసులో ఉన్న ఈ సినిమను ఇప్పుడు సమ్మర్ రేసుకు మార్చే ఛాన్సుందని కూడా అంటున్నారు. దానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ఈ సినిమాను అసలు రికార్డు టైములో షూటింగ్ చేస్తే కాని.. సంక్రాంతికి రెడీ అవ్వదు. పైగా సినిమా రిలీజు టైముకు రెడీ అయినా కూడా.. మరోసారి దసరా తరహాలోనే చుట్టూ విపరీతంగా పోటీ ఉంది. పవన్-త్రివిక్రమ్ సినిమా.. చరణ్-సుకుమార్ సినిమాలతో కలిపి చాలా సినిమాలు సంక్రాంతికి రెడీ అయిపోతున్నాయి. ఇదే దసరా పండగనాడు మహేష్ సోలోగా వచ్చుంటే.. స్పైడర్ కలక్షన్లు ఇంకా ఎక్కువగానే ఉండేవి. అందుకే ఇప్పుడు భరత్ అను నేను సినిమాను సంక్రాంతి రేసులో కాకుండా సోలోగా రిలీజ్ చేద్దాం అనుకుంటన్నాడట మహేష్.

ఏదేమైనా కూడా.. వచ్చే ఏడాది సంక్రాంతి రేసు మాత్రం చాలా రసవత్తరంగానే ఉండనుంది. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలన్నీ చాలా అంచనాలతో రానున్నాయి. మరి ఎవరు రేసులో ఉంటారు ఎవరు ఉండరూ అనేది జనవరి మొదటి వారం వరకు కాస్త సస్పెన్సులోనే ఉండే ఛాన్సుంది. అది సంగతి.