ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి  బాలకృష్ణ, చిరంజీవి సినిమాలతో పోటీపడ్డ శర్వానంద్‌, ‘శతమానం భవతి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నా ఆ తర్వాత వచ్చిన రాధ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది మరి ఈ దసరాకి కూడా అదే తరహా విజయం దక్కుతుందన్న ధీమాతో వున్నాడు శర్వానంద్‌. తన కెరీర్‌లోనే ‘మహానుభావుడు’ సినిమా ది బెస్ట్‌ సినిమా అవుతుందన్నది శర్వానంద్‌ వాదన. అచ్చం ‘భలే భలే మగాడివోయ్‌’ తరహాలో సినిమా కన్పిస్తోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌ కావడం ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ పాయింట్‌. ఇప్పటికే విడుదలైన ‘జై లవకుశ’ సినిమా గ్రాస్‌ పరంగా చూస్తే వందకోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఇక, ‘స్పైడర్‌’ సినిమా విషయానికొస్తే, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా పరిస్థితీ అంతే. మురుగదాస్‌ – మహేష్‌ కాంబినేషన్‌ కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది. ఓపెనింగ్స్‌ పరంగా అటు ‘జై లవకుశ’ కావొచ్చు, ఇటు ‘స్పైడర్‌’ కావొచ్చు.. ఈ రెండు సినిమాలూ సత్తా చాటినా, ప్రేక్షకుల్ని మెప్పించడంలో మాత్రం సఫలం కాలేకపోయాయి.

మొత్తమ్మీద, ఈ దసరా సీజన్‌ ప్రస్తుతానికైతే సినీ ప్రేక్షకుల్ని నిరాశపర్చిందనే చెప్పాలి. ‘మహానుభావుడు’ అయినా సక్సెస్‌ అందుకుని, ‘దసరా’ పండగకి సందడి చేస్తుందా.? వేచి చూడాల్సిందే. 

27 mins