మారుతి టాకీస్ బేన‌ర్ పై దర్శకుడు మారుతి దర్శకత్వంలో బి. చిన్ని కృష్ణ తెర‌కెక్కిస్తున్న చిత్రం  ‘లండ‌న్ బాబులు’ . ర‌క్షిత్, కలర్స్ స్వాతి రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో త‌మిళ మూవీ ఆండ‌వ‌న్ క‌ట్టాలాయ్ మూవీకి రీమేక్ గా లండన్ బాబులు చిత్రం రూపొందుతుంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ సభ్యులు మీడియాతో  మాట్లాడుతూ… ‘’చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారు, నవంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది ” అన్నారు.
చాలా రోజుల గ్యాప్ తరువాత కలర్స్ స్వాతి ఈ సినిమాతో మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది, ఇటివల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. శ్యాం.కే.నాయుడు కెమెరామెన్ గా పనిచేస్తున్న ఈ సినిమాకు కే సంగీతం అందిస్తున్నారు. ప్రేమ, పెళ్ళికి నేటి యువత ఎంత తొందర పడుతుందోఅంతే త్వరగా విడిపోతున్నారు, అదే పాయింట్ తో ఈ సినిమా ఉండడం విశేషం.