కార్తీ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన తమిళ సినిమా ‘ధీరన్‌ అదిగారమ్‌ ఒండ్రు’ను ‘ఖాకి’ పేరుతో తెలుగులో అందిస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా గత కొన్ని ఏళ్లుగా ఎన్నో సినిమాల పాటలు విడుదల అయ్యాయి. తాజాగా ఈ సంస్థ సినిమా నిర్మాణం పై దృష్టి పెట్టింది. ‘ఆదిత్య మ్యూజిక్‌’ ఉమేశ్‌గుప్తా తొలిసారిగా చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించారు. అందులో భాగంగా ఇటీవల విడుదలైన ఈ సినిమా టిజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్ర తెలుగు ఆడియోను నవంబర్ 2 న రేపు  హైదరాబాద్ లో విడుదల కానున్నాయి.
కార్తీ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సత్తా చాటబోతున్నాడు. 2005లో ఓ పత్రికలో వచ్చిన వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు హెచ్‌. వినోద్‌ ఈ కథను సిద్ధం చేశారు. ఈ సినిమాలో సన్నివేశాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉండబోతున్నాయి. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.  నవంబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.