కీరవాణి రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్ !

MM Keeravani Garu Has Sung A Song For A.R.Rahman Sir In His Next Film

236
ఇద్దరూ సంగీత ప్రపంచంలో మేటి !  ఐయినా ప్రయోగాలు చేయడంలో ఎప్పటికప్పుడు సంగీతప్రియులకు వినోదం పంచడంలో ముందుంటారు వారే కీరవాణి రెహమాన్. దర్శకుడు ఎంత కష్టపడినా మ్యూజిక్ డైరెక్టర్ మ్యాజిక్ లేకుంటే సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఒక పాట సినిమా థియేటర్ల వరకు రప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే కేవలం పాటలతోనే సినిమాకు క్రేజ్ తెచ్చి మంచి హిట్ ఇచ్చే సంగీత దర్శకులు కూడా ఉన్నారు. ఆస్కార్ విజేత ఏ.ఏర్ రెహమాన్ సంగీతం ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అయితే సాధారణంగా సంగీత దర్శకులు పాటలు సందర్భానికి తగ్గట్టు రావడానికి కొన్నిసార్లు కొత్తగా ప్రయోగాలు చేస్తారు. సినిమాకు ఆ పాట మరో ఊపిరిని ఇస్తుందంటే ఏ తరహా సింగర్స్ ని అయినా ప్రవేశపెడతారు. మాములుగా సంగీత దర్శకులు స్వతహా సింగర్స్ అయినా వేరొకరి మ్యూజిక్ డైరెక్షన్ లో ఎక్కువగా పాడరు. కానీ రెహమాన్ మాత్రం అప్పుడప్పుడు ఈ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ సారి ఆయన టాలీవుడ్ సంచలన మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్ కీరవాణి గాత్రాన్ని తన కొత్త బాణీకి వాడుకుంటున్నాడు.
రీసెంట్ గా ఈ విషయాన్ని కీరవాణి సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. రెహమాన్ కెరీర్ లో తాను పాడిన పాట మరో మంచి మెలోడీ హిట్ గా నిలుస్తుందని చెప్పారు. అయితే ఏ సినిమాలో పాడారనే విషయాన్ని వివరించలేదు. రెహమాన్ ప్రస్తుతం 99 అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బహుశా ఆ సినిమాకు సంబదించిన పాట అయ్యి ఉంటుందని అందరు అనుకుంటున్నారు. చూడాలి మారి ఆ పాట ఎంతవరకు ఆకట్టుకుంటుందో..