ఇటీవలే విడుదలై రికార్డు సృష్టించిన ‘జై లవ కుశ’ తన త్రిపాత్రాభినయ నటనతో ప్రేక్షకుల్ని మెప్పించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రారంభించారు. కొద్దిరోజుల క్రితమే ప్రారంభోత్సవ కార్యక్రమాల్ని జరుపుకున్న ఈ సినిమా జనవరి నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. తారక్ ఇంతకు ముందు చిత్రాల్లో కన్నా ఈ సినిమాలో పూర్తిగా భిన్నంగా కనిపించడానికి కొత్త లుక్ ట్రై చేస్తున్నాడట.
ఇన్నాళ్లు గడ్డంతో రఫ్ లుక్ లో కనబడిన ఆయన ఈ సినిమాలో మాత్రం పూర్తిగా షేవ్ చేసి క్లాస్ లుక్ లో కనిపించనున్నారట. ఎన్టీఆర్ ట్రై చేస్తున్న ఈ కొత్త అవతారం అభిమానులకు తప్పక నచ్చుతుందని అంటున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.