యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా  నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న  జై లవ కుశ ఈ సినిమాను సెప్టెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసేస్తున్నాడు కళ్యాణ్ రామ్. తమ్ముడితో తొలిసారి తీసిన సినిమాతో ఆల్రెడీ అభిమానులకు ఆనందం.. తమ్ముడికి నేషనల్ అవార్డ్ గ్యారంటీ అంటూ ప్రామిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎట్టకేలకు సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది కాని.. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ తోనే.. సినిమాపై అంచనాలు మారిపోతున్నాయి.

తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జై లవ కుశ.. యు/ఎ సర్టిఫికేట్ తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో బీభత్సమైన గ్లామర్ దారబోసినా కూడా సినిమాకు ‘యు’ సర్టిఫికేట్ వచ్చేస్తోంది కాబట్టి.. సినిమాలోని రక్తపాతం కారణంగానే ఇప్పుడు యు/ఎ ఇచ్చారా అనే సందేహం వస్తోంది. అయితే ఈ సినిమాకు ఒక హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అతను ఈ సినిమాలో ఏం చేశాడో బయటకు ఒక్క పోస్టర్లో కూడా చూపించలేదు. కాని అతను చేసిన స్పెషల్ మేకప్ కారణంగా సినిమాకు యు/ఎ వచ్చిందట. అంటూ ఎన్టీఆర్ ను కొన్ని సీన్లలో అలా వికృతంగా చూపించేశారని టాక్. మరి ఫ్యాన్స్అలా చూసి తట్టుకోగలరా? … ఎన్టీఆర్ జైలవకుశ  ‘యు/ఎ’ సర్టిఫికేట్ చూస్తే అభిమానులు ఫీలవుతున్నారు.