రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం హౌరా బ్రిడ్జ్. ఇటివల విడుదల చేసిన టిజర్ కు మంచి స్పందన లబించింది, అలీ, పోసాని కృష్ణ మురళి పండించిన హాస్యం ఈ చిత్రంలో హైలెట్ కానుందని సమాచారం, విభిన్న‌ కథలతో దూసుకెళ్తున్న రాహుల్ రవీంద్రన్ మరో ఇంట్రస్టింగ్ స్టోరీ “హౌరా బ్రిడ్జ్” చిత్రం తో మనముందుకు వస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్ 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.
బూచ‌మ్మ బూచొడు సినిమా తరువాత యాదు దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఎమ్ వి ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో త్వరలో విడుదల కానుంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాతో మంచి విజయం సాదిస్తాడని ఆశిద్దాం.