అక్టోబర్ 6 న హిందూ సంప్రదాయంలో మూడు ముళ్లతో ఒకటైన సమంత-నాగచైతన్య జంట.. నిన్న సాయంత్రం క్రిస్టియన్ పద్ధతిలో మరొకసారి ఒకటైయ్యారు. తల్లి లక్ష్మి దగ్గుబాటి తోడురాగా, స్టయిలిష్ గా చర్చి ప్రాంగణంలోకి ప్రవేశించాడు నాగచైతన్య. అప్పటికే అక్కడ తన కుటుంబ సభ్యులతో కలిసి వెయిట్ చేస్తోంది సమంత. తర్వాత  క్రిస్టియన్ పద్ధతి ప్రకారం వివాహ వేడుక జరిగింది.

నిన్న సాయంత్రం 6 నుంచి 7గంటల మధ్య జరిగిన ఈ వివాహానికి అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు స్టయిలిష్ గా ముస్తాబై వచ్చారు. వధూవరులిద్దరూ పరస్పరం ఉంగరాలు మార్చుకున్నారు. ఓవైపు ఫారిన్ డాన్సర్లు అందంగా డాన్స్ చేస్తుంటే, వీనుల విందైన సంగీతం మధ్య సమంతను ముద్దాడాడు నాగచైతన్య.

తాళి కట్టించుకున్నప్పుడు ఉద్వేగంతో సంతోషం ఎక్కువై ఏడ్చేసిన సమంత.. క్రిస్టియన్ శైలిలో పెళ్లి జరిగినప్పుడు మాత్రం ముసిముసిగా నవ్వుతూ మురిసిపోయింది. ఉంగరాలు మార్చుకున్న తర్వాత సమంత-నాగచైతన్య కలిసి అలా నడిచివెళ్తుంటే… వారికి ఇరువైపులా ఉన్న బంధువులు అభినందనలు తెలిపారు. అలా సినిమాల్లో చూపించినట్టు కలర్ ఫుల్ గా జరిగింది ఈ క్రిస్టియన్ వెడ్డింగ్. పెళ్లి తర్వాత అతిథులకు పెద్ద పార్టీ ఇచ్చారు.

25 mins