డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురుగా ఓ వైపు మరోవైపు సినిమాలను చేస్తూనే బుల్లితెరపై రియాలిటీ షోలతో అలరించిన మంచు లక్ష్మి ఈ రోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది. మంచు వారి ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక హోదాను తెచ్చుకుంది. ఎవరు చేయని విధంగా మేము సైతం లాంటి ఒక మంచి షో చేసి అందరి ప్రశంసలను అందుకుంది.

స్టార్ హీరోలని షోకి పిలిపించి వారికి పనిచెప్పి కష్టాల్లో ఉన్న వారికి ఎంతో సహాయపడింది. అయితే ఆమె షో ఎండ్ అయిన తర్వాత కూడా ఇప్పటికి ఎవరో ఒకరు తన ఇంటికి వచ్చి ఆదుకోవాలని అడుగుతారని లక్ష్మీ వివరించింది. మా ఇంట్లో మామిడి చెట్టుకు మామిడికాయలే కాస్తాయి. డబ్బులు కాయట్లేదు. నా దగ్గర డబ్బుంటే అందరికి సహాయం చేసేదాన్ని కానీ నా దగ్గర అంత డబ్బులేదు. నా దగ్గర ఉన్నంత వరకు ఎదో ఒక విధంగా సహాయం చేస్తున్నా. కానీ కొందరు ఇంటికి వచ్చి అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాదని వారిని తన ఆఫీస్ కి వెళ్లమని చెప్పి ఎంతో కొంత హెల్ప్ చేయిస్తుంటా లక్ష్మీ తెలిపింది.

ఇక తనకు మేము సైతం వంటి ఒక మంచి ప్రోగ్రాం చేసినందుకు చాలా మంచి ప్రశంసలు దక్కాయని వివరిస్తూ.. తిరుపతికి వెళ్లినప్పుడు కొంతమంది అక్కడ దేవుడు ఉంటే..ఇక్కడ దేవత కనిపిస్తోందని కొందరు మరచిపోలేని కాంప్లిమెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చింది. మూవీరాకర్జ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తున్నాము .