మంచు విష్ణు హీరోగా, జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. గతంలో జి. నాగేశ్వర రెడ్డి మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన దేనికైనా రెడీ, ఈడోరకంఆడోరకం చిత్రాలు మంచి విజయం సాదించాయి. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ కాగా ఇందులో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ప్రముఖ నిర్మాత ఏం.ఎల్.కుమార్ చౌదరి సమర్పణలో కీర్తి చౌదరి, కిట్టు లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్,  డార్లింగ్ స్వామి మాటలు అందిస్తున్నారు .  ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విష్ణు పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 23 న విడుదల చేస్తున్నారు. 
20 mins