పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో ఇది హ్యట్రిక్ సినిమా కావటంతో పాటు ఈ సినిమా పవన్ 25వ సినిమా కూడా కావటంలో అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాధకృష్ణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాను ముందుగా దసరాకు రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో షూటింగ్ ఆలస్యమైంది. దీంతో సినిమాను జనవరి 10న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.అ యితే దసరా రోజు అభిమానులను నిరాశపరచకూడదన్న ఉద్దేశంతో ఆ రోజు పవన్ స్వయంగా ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దసరాతో రూమర్స్ కు చెక్ పెట్టాలని భావిస్తున్నారు.