పవన్ కి సెట్స్ లో సర్ప్రైజ్ ఇచ్చిన చిరంజీవి – సురేఖ .. పవన్ ఫుల్ హ్యాపీ!

336

ఇవాళ తన పుట్టిన రోజుని జరుపుకోబోతున్న పవన్ కళ్యాణ్ ని కలవడం కోసం ఆయన అన్నయ్య వదిన పవన్ కొత్త సినిమా షూటింగ్ సెట్స్ కి రావడం ఇంటర్నెట్ లో పెద్ద వార్త అయ్యింది, మెగా ఫామిలీ కి పెద్ద అయిన చిరంజీవి కీ ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్  కి ఎప్పటి నుంచో మనస్పర్ధలు ఉన్నాయి అనేది బయట వినపడే మాట . అవి రాజకీయ బేధాలు తప్ప పర్సనల్ గా ఇద్దరి మధ్యనా ఎలాంటి వైరుధ్యం లేదు అనేది పవన్ , చిరు చెబుతున్నా కూడా చాలా సార్లు ఈ విషయం జనం లో గట్టిగానే వినపడింది. దీనిని పటాపంచలు చేస్తూ చిరు తన సతీమణి తో కలిసి త్రివిక్రమ్ – పవన్ ని కలిసారు.
ఆయనని .. ఆ సినిమా యూనిట్ ను సర్ ప్రైజ్ చేస్తూ చిరంజీవి దంపతులు అక్కడికి వచ్చారు. వాళ్ల రాక పట్ల పవన్ ఆనందంతో పొంగిపోయారు. చిరూ దంపతులు పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నావదినల నుంచి పవన్ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సంఘటనతో అక్కడి సెట్ లో పండుగ వాతావరణం నెలకొంది. అన్నదమ్ముల మధ్య ఎలాంటి అరమరికలు లేవనే విషయాన్ని స్పష్టం చేసింది.